Salesforce అనేది ఒక Cloud-based CRM (Customer Relationship Management) platform. ఇది business operations streamline చేయడానికి, కస్టమర్ recordలు, sales, marketing, support activities manage చేయడానికి ఉపయోగపడుతుంది. Salesforce లో మీకున్న predefined tools దాదాపు అన్ని processes ను automate చేయగలవు. కానీ Complex Business Requirements లేదా Customizations కి వచ్చే సరికి, వాటిని handle చేయడానికి Apex Code ని ఉపయోగిస్తాము.
Apex అంటే ఏమిటి?
Apex అనేది Salesforce కోసం ఒక programming language, ఇది Java లాగా ఉంటుంది. Apex ద్వారా మనం Salesforce లో complex logic ని define చేసి, automation ను మరింత శక్తివంతంగా చేయవచ్చు. Backend Operations ని handle చేయాలి అంటే, Apex ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
Apex Code ఎందుకు వాడాలి?
Salesforce లో అందుబాటులో ఉన్న declarative tools (like workflows, process builders, flows, validation rules) తో మీరు కొన్ని basic automations చేయవచ్చు. కానీ మరింత కాంప్లెక్స్ లేదా ప్రత్యేకమైన లాజిక్ ఉండాలి అంటే, Apex Code వాడటం తప్పనిసరి.
అవసరాలు (Use Cases)
Integration with Third-Party Systems: మీరు Salesforce ని ఇతర external systems (like payment gateways, ERPs) తో connect చేసి, data fetch లేదా send చేయాలి అంటే Apex HTTP Callouts వాడాలి.
Custom Business Logic Implementation: మీరు specific business logic ని define చేయాలి అంటే, మీరు Apex వాడాల్సి ఉంటుంది.
Example: ఒక order create చేయగానే, discount లాజిక్ ని calculate చేసి, specific approval process కి పంపాలి.
Triggers for Real-Time Actions: మీరు ఒక record create లేదా update అయ్యినప్పుడు, వెంటనే ఒక custom action perform చేయాలి అంటే Triggers వాడాలి.
Example: ఒక Opportunity close అయిన వెంటనే, related Account యొక్క ఫీల్డ్స్ update అవ్వాలి అంటే, మీరు trigger వాడి automation చేయవచ్చు.
Batch Processing: ఒకేసారి పెద్ద సంఖ్యలో records ని process చేయాలి అంటే, Apex Batch Classes వాడాలి.
Example: మీకు 50,000 contacts update చేయాలి అంటే, batch process వలన అది సులభం అవుతుంది.
Apex Features (ఉపయోగాలు )
Integration Friendly: Apex వలన మీరు external systems తో integration చేయవచ్చు, APIs వాడి real-time లో third-party systems నుండి data fetch చేయవచ్చు.
Object-Oriented Programming: Apex ఒక object-oriented language. మీరు classes, objects, inheritance వంటి concepts వాడాలి.
Triggers: Apex triggers వలన మీరు Salesforce లోని records create, update, delete అవగానే, custom operations run చేయవచ్చు.
Bulk Operations: Apex bulk data ను process చేయగలదు. అదే అంటే, మీరు 50,000 records ను ఒకే time లో update చేయవచ్చు.
Batch Apex: Large-scale operations కోసం మీరు Batch Apex వాడాలి.
Example: మీకు 10,000 records process చేయాలి అంటే, Batch Apex వలన అది సులభంగా అవుతుంది.
Apex Code Structure (కోడ్)
Apex code structure కూడా Java లేదా C# లాంటి languages ని పోలి ఉంటుంది. ప్రతి Apex code block లో Classes, Methods, Variables, Loops, మరియు Conditions ఉంటాయి.
Example Code:
public class OrderProcessor {
public void calculateDiscount(Opportunity opp) {
if (opp.Amount > 10000) {
opp.Discount__c = 10; // 10% discount
} else {
opp.Discount__c = 5; // 5% discount
}
update opp;
}
}
ఈ కోడ్ లో, మీరు ఒక Opportunity యొక్క discount calculation logic ని కస్టమైజ్ చేస్తారు. Opportunity amount ఆధారంగా discount value ని set చేస్తారు.
ఎప్పుడు Apex Code వాడాలి?
External Integrations చేయాలి అంటే: మీరు Salesforce ని third-party systems తో connect చేయాలి అంటే, API integration వలన data push లేదా fetch చేయవచ్చు.
Complex Business Logic ఉన్నప్పుడు: ఒక simple workflow లేదా process builder తో handle చేయలేని logic ఉంటే.
Triggers వలన Immediate Action కావాలంటే: కొన్ని cases లో ఒక record create అవగానే actions perform చేయాలి అంటే triggers ఉపయోగించాలి.
Large Data Processing చేయాలి అంటే: ఒకే సారి వేలల్లో records update చేయాలి అంటే batch apex ఉపయోగించాలి.
Apex వలన Salesforce లో మీరు advanced మరియు customized functionalities ని సులభంగా implement చేయవచ్చు. Triggers, Batch Apex, మరియు HTTP Callouts వంటి features వలన మీ business logic ని చక్కగా automate చేయవచ్చు. కాబట్టి, ఒక వేళ మీరు Salesforce లో ఉన్న predefined tools తో మీ అవసరాలు తీరడం లేదు అనుకుంటే, Apex Code సరిగ్గా మీకు ఉపయోగపడుతుంది.
Note:
మీకు కంటెంట్ తెలుగు లో ఎలా ఉంది?, ఎలా అర్ధం అవుతుంది? అనేది , మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని మరియు మీ యొక్క సిటీ ని కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాము.
Super 👏 👏..can you place all topics like ..some times topics will be easy understand in mother tongue
Super+++++